📄 ePaper
Sunday, June 7, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగ్రామ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

గ్రామ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

 

వరుకోలు గ్రామ యాదవ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

బెజ్జంకి-కోహెడ ఏప్రిల్ 21(ప్రజావాణి )

సిద్ధిపేట జిల్లా  కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని యాదవ సంఘ సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా కొత్త కమిటీని ప్రకటించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షునిగా మేండే లచ్చయ్య యాదవ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షునిగా దాడి బక్కయ్య యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా పోలం (మేండే) పరశురాములు యాదవ్ ఎంపికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా ఆవుల మల్లేష్ యాదవ్, దాడి గట్టుమల్లు యాదవ్, మేండే శ్రీనివాస్ యాదవ్, కొమ్ము సంపత్ యాదవ్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో యాదవ సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular