బెజ్జంకి మండలంలో మహనీయుల జయంతుల నిర్వహణకు తహసీల్దాకి వినతి
బెజ్జంకి,ఏప్రిల్ 4(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం మండల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీకాంత్ అధికారికి వినతి పత్రం సమర్పించారు.ఏప్రిల్ నెలలో జరగనున్న మహనీయుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఏప్రిల్ 5న డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత సాకలి ఐలమ్మ జయంతులను ఘనంగా నిర్వహించాలని వినతిలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దీటి బల్ నర్సు, ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు, స్వేరో సిద్ధిపేట జిల్లా మాజీ అధ్యక్షులు ఉప్పులేటి బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాస్, ఎల్. శేఖర్ బాబు, మండల నాయకులు యాల పర్శరాములు, మాసం బాబు తదితరులు పాల్గొన్నారు.




