📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శకటోత్సవంలో పోలీసుల సందడి(సవారీ )వైరల్

బెజ్జంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శకటోత్సవంలో పోలీసుల సందడి(సవారీ )వైరల్

📰 Generate e-Paper Clip

బెజ్జంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

శకటోత్సవంలో పోలీసుల సందడి వైరల్

బెజ్జంకి, ఏప్రిల్ 4(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శకటోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ యొక్క ఉత్సవంలో భాగంగా సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను స్వయంగా ఎద్దుల బండిపై సవారి చేయడం భక్తులను ఆకట్టుకుంది.అదే బండిపై బెజ్జంకి ఎస్సై సౌజన్య, కానిస్టేబుల్ కోడిసెల శ్రీనివాస్ కూడా పాల్గొనడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.
పోలీసు అధికారులు భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.వారి సమన్వయం,పాల్గొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పోలీసుల భాగస్వామ్యం ప్రజలతో వారి సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular