📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) పోరుమామిళ్ల మలేరియా నిర్మూలన ధ్యేయంగా ఇప్పుడు మనం సాధించగలం,ఇప్పుడు మనం తప్పక సాధించాలి అనే నినాదంతో ఈరోజు పోరుమామిళ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈనెల ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.ఈ సందర్భంగా విద్యార్థినులకు మలేరియా వ్యాధిపై అవగాహన సదస్సు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి టి. నరసింహా రెడ్డి మాట్లాడుతూ.మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి అని, దీని పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రధానంగా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని వివరించారు:పరిసరాల పరిశుభ్రత:నివాస ప్రాంతాల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు.ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడం.​వ్యక్తిగత జాగ్రత్తలు రాత్రి వేళల్లో తప్పనిసరిగా దోమతెరలు వాడాలని,ఒంటి నిండా బట్టలు ధరించడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు.త్వరిత చికిత్స:చలితో కూడిన జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలని కోరారు.ప్రతిభ చాటిన విద్యార్థినులు:మలేరియా నిర్మూలనలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.నివారణ మార్గాలపై ప్రతిభ కనబరిచిన విజేతలు మొదటి బహుమతి,శాని,రెండవబహుమతి,రమ్య,మూడవబహుమతి వసిత,మాధవి,లకు బహుమతులు అందజేశారు.విద్యార్థులు వేసవి సెలవుల్లో తమ గ్రామాల్లోని ప్రజలకు మలేరియాపై అవగాహన కల్పించి చైతన్యపరచాలని సబ్ యూనిట్ ఆఫీసర్,టి.నరసింహా రెడ్డి,కోరారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్,సత్యనారాయణ,వెంకటరమణ,సి హెచ్ ఓ’ ప్రియాంక,రాజేశ్వరి,ప్రిన్సిపల్,నాగమల్లేశ్వరి,వైస్,ప్రిన్సిపాల్,భాగ్యలక్ష్మి,సైన్స్ టీచర్,నజీమా,ఇంగ్లీష్ టీచర్,రెడ్డమ్మ,ఏఎన్ఎంస్,సులోచన రాణి,ఆశా కార్యకర్తలు పాఠశాల ఏఎన్ఎం,మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular