మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) పోరుమామిళ్ల మలేరియా నిర్మూలన ధ్యేయంగా ఇప్పుడు మనం సాధించగలం,ఇప్పుడు మనం తప్పక సాధించాలి అనే నినాదంతో ఈరోజు పోరుమామిళ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈనెల ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.ఈ సందర్భంగా విద్యార్థినులకు మలేరియా వ్యాధిపై అవగాహన సదస్సు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి టి. నరసింహా రెడ్డి మాట్లాడుతూ.మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాపించే...