మతం మార్చుకోవాలని ఒత్తిడి.. రూ. 20 లక్షల మోసం
ఘట్కేసర్ దంపతుల ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు!
చెన్నారావుపేట జూలై 09 ప్రజావాణి
చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న కేసులో పక్కింటి వారే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.రవికుమార్, శిరీషలను మతం మారాలంటూ పక్కింటి వెంకట్, ప్రమీల దంపతులు తీవ్రంగా వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది.నగలు తాకట్టు పెట్టించి.. మతం మారకపోవడంతో రెడీమిక్స్ వ్యాపారం పేరుతో శిరీష నగలను తాకట్టు పెట్టించి రూ. 20 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. మృతుల కుమారులు సుశాంత్, విద్వాన్స్లను పోలీసులు విచారించగా, ఇంట్లో జరిగిన గొడవలు, ఆర్థిక వేధింపుల వివరాలు వెల్లడయ్యాయి.తీవ్ర మనస్తాపంతో జూలై 2న దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, నిందితులు వెంకట్, ప్రమీల ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు.




