📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetమడేలేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం

మడేలేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 19 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని మడేలేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రజక సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ వేదపండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు కోరారు.
ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు,గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ గణపతి హోమం నిర్వహించినట్లు రజకసంఘం నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయితీ కార్యదర్శి, రజక సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular