గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ఇంటి పన్నుల వసూళ్లలో, కార్పొరేషన్ల విభాగంలో మంగళగిరి–తాడేపల్లి కి 76.69% తో రాష్ట్ర స్థాయి లో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పొరేషన్ ల ఆస్తి పన్ను ల (ప్రాపర్టీ ట్యాక్స్) వసూళ్లలో మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ 76.69% తో ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కు ప్రతిష్ఠాత్మక అవార్డు మరియు ప్రశంసా పత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా నగర పాలక సంస్థ కమీషనర్ అలీం బాషా అందుకున్నారు.
