📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబేగంపేట్‌ గ్రామంలో ఘనంగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బేగంపేట్‌ గ్రామంలో ఘనంగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఏప్రిల్ 27(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా ఇంచార్జి ఎలా శేఖర్ బాబు ఎగురవేశారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీని ఆత్మగౌరవ ప్రతీకగా, ప్రజా ఉద్యమ పతాకంగా అభివర్ణించారు.ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేతల మధ్య 2001లో ప్రారంభమైన గులాబీ జెండా పాతికేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి,పోరాటంలోనూ పాలనలోనూ తన ప్రత్యేకతను చాటుకుందని,ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఆర్‌ఎస్‌ తన ధైర్యాన్ని కోల్పోలేదని, ప్రజలకు నమ్మకంగా నిలిచిందని తెలిపారు.ఇక 25 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బీఆర్‌ఎస్‌ 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షులు చింతలపల్లి సంజీవ రెడ్డి, కొరివి తిరుపతి, బెజ్జంకి పోచయ్య, బెజ్జంకి శంకర్, కొరివి కనకయ్య, రవి, సత్తయ్య, అంజయ్య, పోచయ్య, కిరణ్, మల్లేశం, తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular