*బెల్లంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు*
*టైమ్స్ ఆఫ్ వార్త, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి, బుచ్చయ్య పల్లి, లింగాపూర్ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆద్వర్యంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి వేడుకలు నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ముందుగా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చేలా కేసిఆర్ నేతృత్వంలో ఆయన తనయుడు కేటీఆర్ పోరాట నిర్వహించారని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను దేశం గర్వించే విధంగా అభివృద్ధి పథంలో తీసుకోవడంలో కేటిఆర్ కృషి ఎనలేనిదని కొనియాడారు. ఐటీ రంగంలో సైతం తనదైన ముద్ర వేస్తూ, రాష్ట్రాన్ని బటి రంగంలో మేటిగా తీర్చిదిద్దడంలో కేటిఆర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఐటీ రంగ విస్తరణతో రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించాయన్నారు. కేటీఆర్ సేవలను ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రశంసించాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సుభాష్ రావు, నాయకులు బత్తుల రమేష్,లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేష్, నాయకులు చిరంజీవి, గంధం తిరుపతి, మహేందర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





