📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకి పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

బెజ్జంకి పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

📰 Generate e-Paper Clip

బెజ్జంకి పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

బెజ్జంకి,మార్చి31(ప్రజావాణి)

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ (పెద్దన్న) మరియు మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాధురి మాట్లాడుతూ, ప్రముఖ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో గైనకాలజీ, దంత, చర్మ, ఎముకల, జనరల్ ఫిజీషియన్, బీపీ, షుగర్ తదితర విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించుకొని,అవసరానికి అనుగుణంగా వైద్యులు ఉచితంగా మందులు అందజేశారు.
ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన బెజ్జంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular