బెజ్జంకిలో జనగణన 2027 శిక్షణ ప్రారంభం
బెజ్జంకి,ఏప్రిల్ 23 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో జనగణన 2027 రెండవ విడతకు సంబంధించి గణనాధికారులు, పర్యవేక్షకుల కోసం మూడు రోజుల శిక్షణా కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది.ఈ శిక్షణ ఏప్రిల్ 23 నుండి 25 వరకు కొనసాగనుంది.ఈ యొక్క కార్యక్రమాన్ని చార్జ్ ఆఫీసర్, తహశీల్దార్ శ్రీకాంత్ ప్రారంభించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు, విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్షేత్ర శిక్షకులు మనోహర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

