📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetబూరుగడ్డలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం.

బూరుగడ్డలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం.

📰 Generate e-Paper Clip

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి.

హుజూర్‌నగర్, ప్రజావాణి జూన్ 20: హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో నిర్వహించిన కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ మరియు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ సందర్భంగా శ్రీలతారెడ్డి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, సమాజ సేవలో ఇది అత్యంత గొప్ప పుణ్యకార్యమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సత్సంకల్పాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు ఆమె అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు ఉమా మహేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోటిరెడ్డి, బీజేపీ నాయకులు మాడ్గుల లక్ష్మీనారాయణ, కనకయ్య, నాగరాజు, రాములు, చారి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular