📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువకులు

అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువకులు

📰 Generate e-Paper Clip

అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువకులు

ప్రజావాణి ప్రతినిధి :

బీర్కూరు మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం కమ్మరి పండరి అకాల మరణం చెందడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న మేరు భరత్ సామాజిక సేవకుడు సితలే రమేష్‌ను సంప్రదించారు. స్పందించిన సితలే రమేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా విరాళాలు సేకరించి రూ.20,000లను సమీకరించారు.

సేకరించిన ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసి వారి దహన సంస్కారాల నిర్వహణకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు కూడా సహకరించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో సితలే రమేష్, మేరు భరత్, అబ్దుల్ నయీం, గంధ్యతం రమేష్, పెంకి రమేష్, నారం ప్రవీణ్, శ్రీకాంత్, పరచు ప్రవీణ్, మేకల మహేష్ తదితర గ్రామ యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular