📄 ePaper
Monday, August 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyబీరంగూడలో డిజిటల్ విప్లవానికి నాంది 

బీరంగూడలో డిజిటల్ విప్లవానికి నాంది 

📰 Generate e-Paper Clip

•బీరంగూడలో డిజిటల్ విప్లవానికి నాంది

*ఎస్‌ఏ కంప్యూటర్స్ ప్రారంభం

*ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్

అమీన్‌పూర్, ఆగస్టు 2 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలో ఆధునిక కంప్యూటర్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఏ కంప్యూటర్స్ – సేల్స్ అండ్ సర్వీసెస్ సంస్థను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ సేవలు ప్రతి ఒక్కరికీ అత్యవసరమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ ఉపకరణాలు, మరమ్మతు సేవలు, సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ప్రారంభమైన ఎస్‌ఏ కంప్యూటర్స్ ప్రజల ఆదరణతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

సంస్థ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం సంస్థ యజమానులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular