📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గుగ్గిళ్ల గ్రామంలో వెలగని వీధి విద్యుత్ దీపాలు - 2వ వార్డు ప్రజలు అవస్థలు

గుగ్గిళ్ల గ్రామంలో వెలగని వీధి విద్యుత్ దీపాలు – 2వ వార్డు ప్రజలు అవస్థలు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఆగస్టు 3 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలోని 2వ వార్డులో వీధి విద్యుత్ దీపాలు రాత్రి సమయంలో వెలగకపోవడంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో రాత్రివేళ చీకట్లు అలుముకుని ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది.చీకటి కారణంగా రోడ్డుపైకి ఏదైన విషసర్పాలు,ఇతర విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు రాత్రి సమయంలో బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గ్రామంలోని పనిచేయని వీధి విద్యుత్ దీపాలను వెంటనే మరమ్మతు చేసి, 2వ వార్డుతో పాటు అవసరమైన అన్ని ప్రాంతాల్లో వెలుగులు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ అధికారులు, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.ఈ యొక్క వీధి దీపాల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular