📄 ePaper
Monday, August 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు చేరాలంటే అధికారుల పాత్ర చాలా కీలకమైనది ఎమ్మెల్యే జారె

ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు చేరాలంటే అధికారుల పాత్ర చాలా కీలకమైనది ఎమ్మెల్యే జారె

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు చేరాలంటే అధికారుల పాత్ర చాలా కీలకమైనది – ఎమ్మెల్యే జారె

గండుగులపల్లి, ప్రజావాణి న్యూస్ న్యూస్, ఆగష్టు 01:
అశ్వారావుపేట నియోజకవర్గ  ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు మరియు అభివృద్ధి పనులపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఫారెస్ట్ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని, నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం స్థానిక మినీ స్టేడియంలో ఆగస్టు 15 వేడుకల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular