ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
.. తల సేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి
మందమర్రి, (మన ప్రజావాణి) ఏప్రిల్ 21:
ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
మే 8 న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి, గిరిజన ప్రాంతాలలో తలసేమియా వ్యాధి రోజురోజుకు పెరుగుతున్నందున దీనిని అరికట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధి నియంత్రణలో ప్రభుత్వాల పాత్ర కీలకమని, తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో
కరపత్రాలు, వాల్ పోస్టర్లు, హోర్డింగ్స్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజల్లో అవగాహన పెంచాలి.
ఎయిడ్స్ ప్రచారం తరహాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.
అదేవిధంగా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల స్థాయిలో
ప్రభుత్వ అధికారులు,
వైద్య సిబ్బంది
స్వచ్ఛంద సేవా సంస్థలు
విద్యార్థులు
అందరినీ భాగస్వామ్యం చేసి ర్యాలీలు, ఊరేగింపులు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించాలనీ, ఈ వ్యాధిని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాలను ఆయన కోరారు.
ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
.. తల సేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి
RELATED ARTICLES



