ప్రధాన రహదారిపై గుంతలు పట్టించుకోని అధికారులు
*ప్రజావాణి ప్రతినిధి, నక్క సునీల్ కుమార్, జూన్ 05,*
సిర్పూర్ (టి): మండల కేంద్రంలోని బంధన్ బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా గుంతలు మరింత పెద్దవిగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన రహదారిపై గుంతలు పట్టించుకోని అధికారులు
RELATED ARTICLES




