📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalప్రతిభకు నీరాజనం.. ఆదర్శప్రాయులకు ఘన సన్మానం

ప్రతిభకు నీరాజనం.. ఆదర్శప్రాయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ప్రతిభకు నీరాజనం.. ఆదర్శప్రాయులకు ఘన సన్మానం

దళిత రత్న శ్రీనివాస్ తెలుగు ఉపాధ్యాయుడు కరుణాకర్ కు అభినందనల వెలువ

పాత ముగ్ధుంపురంలో మిన్నంటిన ఉత్సాహం

చెన్నారావుపేట మే 4 (ప్రజావాణి)

మట్టిలో పుట్టిన మాణిక్యాలను పాత ముగ్ధుంపురం గ్రామస్తులు గుండెలకు హత్తుకున్నారు. తమ సేవాగుణంతో, విద్యా ప్రతిభతో గ్రామానికీ రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చినా ఆదర్శమూర్తులకు యువజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నీరజనాలు పలికారు. ఆదివారం నిర్వహించిన భవ్య అభినందన సభ గ్రామ చరిత్రలో మైలురాయిల నిలిచిపోయింది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి గా నిరంతర ప్రజా సేవకుడిగా గుర్తింపు పొంది ఇటీవల అత్యున్నత దళితరత్న పురస్కారాన్ని అందుకున్న దబ్బేట శ్రీనివాస్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఆయన సాధించిన విజయం కేవలం వ్యక్తిగతమైనది కాదని అది పాత ముగ్ధుంపురానికే గర్వకారణమని కొనియాడారు. విద్యా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ శాసనబాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలుగు ఎంఏబీఈడీ ఉపాధ్యాయుడు కరుణాకర్ ను ప్రత్యేకంగా సత్కరించారు. అక్షరమే ఆయుధంగా యువతను తీర్చిదిద్దుతున్న కరుణాకర్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా యువజ్యోతి యూత్ సభ్యులు మాట్లాడుతూ.. అవార్డులు ఆచివర్లకు అలంకారాలు మాత్రమే కాదు అవి భావితరాలకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అంబేద్కర్ జ్యోతిరావు పూలే వంటి మహానీయుల బాటలో నడుస్తూ గ్రామంలోని వ్యక్తులను మేధావులు గా తయారు చేయడమే తమ లక్ష్యమని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ ననుమాస కరుణాకర్, ఉప సర్పంచ్ అలువాల శ్రీనివాస్,సర్పంచ్ ననుమాస కరుణాకర్వార్డు మెంబర్ జన్ను రమేష్,మాజీ ఉపసర్పంచ్ మేకల సదానందం,
యువ జ్యోతి యూత్ అధ్యక్షుడు చెరిపల్లి రాజు,ఉపాధ్యక్షుడు సుంకరి రాజు, గుర్రం స్వామి, జన్ను రమేష్, సుంకర సురేష్ ,సుంకరి రాజు,తదిరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular