సిద్దిపేట ఏప్రిల్ 15 ప్రజావాణి
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్- అలైవ్ రోడ్డు భద్రతవారోత్సవాలలో భాగంగా మూడవ రోజు సిద్దిపేట కేంద్రంలోని మాడ్రన్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేయబడింది. సిద్దిపేటలోని మెరీడియన్ , తులిప్స్, యస్ ఆర్ టెక్నో, అంబిటస్ , సిటిజన్, జెడ్ పి హెచ్ ఎస్ రంగదంపల్లి పాఠశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అడిషనల్ డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి , ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ , ట్రాఫిక్ ఏసీపీ సుమంత్ కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ , ఆర్ టి ఓ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, విద్యార్థులతో కలిసి మానవహారం విద్యార్థులు, పోలీసులు, వాలంటీర్లు కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచి ట్రాఫిక్ నియమాలపై చర్చించి, భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు లేఖలు రాస్తూ “నాన్నా… నాకు, అమ్మకు హెల్మెట్ కొనండి” అంటూ రోడ్డు భద్రతపై బాధ్యతను గుర్తు చేశారు. రోడ్డు భద్రత ఒక చట్టం మాత్రమే కాదు… అది మన జీవితానికి రక్షణ కవచం.పిల్లల కోసం మనం నియమాలు పాటిస్తేనే భవిష్యత్ సురక్షితం అవుతుందనీ, ప్రతి తల్లిదండ్రి, ప్రతి డ్రైవర్ బాధ్యతతో వ్యవహరించాలని అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్,సూచించారు.‘అరైవ్ అలైవ్’ లక్ష్యం ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంమని స్పష్టం చేశారు.సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సురక్షితంగా రోడ్డు దాటే విధానం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై బస్సుల్లో జాగ్రత్తలు పాఠశాలల వద్ద వేగ నియంత్రణ గురించి, మైనర్ల వాహన డ్రైవింగ్‌పై నిషేధం , ట్రిపుల్ రైడింగ్‌పై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. అలాగే సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి , ఇన్స్పెక్టర్ వాసు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ , ట్రాఫిక్ ఏసీపీ సుమంత్ కుమార్, ఇన్స్పెక్టర్ ఉపేందర్ (2 టౌన్), ఆర్ టి ఓ. శంకర్ నారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..




