ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యంవొడితల ప్రణవ్
– ప్రజల్లో ఉనికి కాపాడుకోవడానికి కౌశిక్ రెడ్డి కొత్త నాటకాలు
* గత ప్రభుత్వం ఇచ్చింది అన్న బండి సంజయ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
* డంప్ యార్డ్ కు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి తేడా తెలుసుకోండి.డంప్ యార్డ్ హుజురాబాద్ లో పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు.
* బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్
జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే మాకు ప్రధానమని,రాజకీయం కోసం బిఆర్ఎస్,బీజేపీ పార్టీలు చేస్తున్న కుటిల రాజకీయం ప్రజల్లోకి తీసుకెళ్తామని,డంప్ యార్డ్ పెడతామని ఎక్కడా చెప్పలేదని,వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్,డంప్ యార్డ్‌కు తేడా తెలుసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సూచించారు.సోమవారం నాడు హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్ లో నియోజకవర్గ పరిధిలోనీ 5 మండలాలు రెండు పట్టణాలకు కలిపి 58,44,500/- విలువ చేసే 181 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు కష్ట కాలంలో మాకు అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ డంప్ యార్డ్ గురించి,వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గురించి తెలియకుండామాట్లాడుతున్నారని,అస్సలు ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలాంటి ముందుకు వెళ్లకున్న ఏదో జరుగుతుందని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని,గత ప్రభుత్వం(బిఆర్ఎస్)లో ఈ ప్రతిపాదన వచ్చిందని,బీజేపీ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్,కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సజయ్ మాట్లాడారని అప్పుడు ఎమ్మెల్సీ గా ఉన్న కౌశిక్ రెడ్డి ఇది తెలిసి కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్సీగా,ఎమ్మెల్యేగా చస్తా అని శవ రాజకీయాలు తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారుకేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రణవ్
హుజురాబాద్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గురించి మాట్లాడే ముందు కరీంనగర్ డంప్ యార్డ్ పై అక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు ప్రణవ్..అక్కడి ప్రజలు డంప్ యార్డ్ మాకు వద్దు అని చెప్పినా ఎంపీగా,కేంద్ర మంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇక్కడికొచ్చి స్పీచ్‌లు ఇవ్వడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని,కౌశిక్ రెడ్డి,బండి సంజయ్ వ్యాఖ్యలు ఒకేలాగా ఉన్నాయని ఇద్దరు దొందూదొందే అని అన్నారు..వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వేరే చోటుకు తరలించేలా మంత్రులను సంబంధిత అధికారులను కలిశామని,దానికి అనుగుణంగా మున్సిపల్ పాలకపక్షం ప్లాంట్ వేరే చోటుకు మార్చాలని తీర్మానం చేశామని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు హాని చేసే పని చేయమని మరోసారి పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని,హుజురాబాద్,జమ్మికుట కౌన్సిలర్లు,వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డ్ సభ్యులు,దేవస్థాన చైర్మన్లు,మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు,మండల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్.నాయకులుమైనారిటీ,యువజనబ్లాక్ కాంగ్రెస్,సేవాదళ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



