📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarచెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

చెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

📰 Generate e-Paper Clip

చెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

* చెత్త పై చెత్త రాజకీయం చేయకండి

* సపోర్ట్ ఫుల్.సొల్యూషన్ నిల్

జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)

హుజురాబాద్ డంపింగ్ యార్డ్ మద్దతు మాటల్లోనేనా పరిష్కారం ఎక్కడఅన్ని రాజకీయ పార్టీలు మద్దతుతెలుపుతున్నప్పటికీహుజురాబాద్ డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదుమాటల్లో ఏకాభిప్రాయంచర్యల్లో ఆలస్యం ఎందుకనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయికరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. చెత్త కుప్పల వల్ల ఏర్పడుతున్న దుర్వాసన కాలుష్యంవ్యాధుల భయం ప్రజలనుతీవ్రంగాకలవరపెడుతోందిఈ సమస్యపై అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ప్రజల పక్షాన నిలుస్తామని ప్రకటిస్తున్నాయినాయకులందరూ ఒకే వేదికపై సమస్యను అంగీకరిస్తూ పరిష్కారం అవసరమనిచెబుతున్నారుఅయితే ఇక్కడే అసలు ప్రశ్న ముందుకు వస్తోందిఅందరూ మద్దతు ఇస్తేసమస్య ఇంకా ఎందుకు కొనసాగుతోంది?
మాటల్లో ఏకమై ఉన్న నాయకులుచర్యల్లో మాత్రం విభిన్నంగా కనిపిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సమన్వయం లోపం, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం, నిర్ణయాలలో ఆలస్యం వంటి కారణాల వల్ల సమస్య మరింత ముదురుతోందని స్థానికులు అంటున్నారుఈ సమస్యపై ముందుగా స్పందించి ఉద్యమాన్ని ప్రారంభించిన సబ్బని వెంకట్
శాంతియుత మార్గంలోనే పరిష్కారం సాధ్యమని నమ్ముతూ సబ్బని వెంకట్ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సీఎం స్థాయిలో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే లక్ష్యంతో కృషి కొనసాగుతోందిఅయితే మరోవైపురాజకీయ హడావిడి పెరుగుతున్నా, ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ప్రజల సమస్యను అందరూ అంగీకరించినప్పటికీఅమలు దశలో ఆలస్యం ఎందుకనే సందేహంమరింతబలపడుతోందిడంపింగ్ యార్డ్ సమస్య కేవలం స్థానిక ఇబ్బంది కాదుఇది ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాబట్టి మాటలకే పరిమితం కాకుండాతక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.మద్దతు ప్రకటించడం సరిపోదుసమన్వయం స్పష్టమైన ప్రణాళిక వేగవంతమైన చర్యలు అవకానీ సరం.అందరూ కలిసి మాట్లాడితే కాదుకలిసి పనిచేస్తేనే సమస్యకు పరిష్కారంప్రజల ప్రశ్న ఒక్కటే వినిపిస్తుంది
మద్దతు ఉందికానీ పరిష్కారం ఎక్కడ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular