పోలీసు స్టేషన్ పరిధిలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత నిఖీలు
* ఎవరైనా గంజాయిమత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు
* ఎస్ఐ కాంత్రికుమార్
జమ్మికుంట జూలై 10 (ప్రజావాణి)
ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కాంత్రికుమార్ అన్నారుశుక్రవారం ఇల్లందకుంట పోలీసు స్టేషన్ పరి|ధిలోని ఇల్లందకుంట సిరిసేడు గ్రామంలో కిరాణా షాపులు హోటల్స్ పాన్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారుఈ సందర్భంగా ఎస్ఐ కాంత్రి కుమార్ మాట్లాడుతూఎవరైనా గంజాయిమత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు ప్రస్తుత సమాజంలో గాంజాయి లాంటి మాదకద్రవ్యం మన యువతని సమాజాన్ని పట్టిపీడిస్తుందని దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహించామని. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి ఉపయోగించేవారు ఉన్నా, సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు. వారి వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.





