కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) బద్వేల్ పోరుమామిళ్ల కలసపాడు,మండలంలోని కొన్ని దుకాణాలలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్ను వాడుతున్నారు అధికారులు చూసీచూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా వాళ్లకు ముడుపులు వెళుతున్నాయి అనేది ప్రజల్లో గుసగుసలాడుతున్నారు,ధూకాణాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు కాకపోవడంపై వార్తలు,ప్రజల ఆందోళనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం విధించినప్పటికీ,క్షేత్రస్థాయిలో,ముఖ్యంగా చిన్న దుకాణాలు,కిరాణా షాపులు,వీధి వ్యాపారుల వద్ద ప్లాస్టిక్ కవర్ల వాడకం ఇంకా కొనసాగుతోందని వార్తా కథనాలు చెబుతున్నాయి.ప్రధాన కారణాలు ప్రత్యామ్నాయాల కొరత/ఖర్చు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా కాగితం లేదా బట్ట సంచులు వాడటం వ్యాపారులకు ఖర్చుతో కూడుకున్న పని,అందువల్ల ప్లాస్టిక్ వైపే మొగ్గు చూపుతున్నారు.చర్యల్లో లోపం అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా,నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిషేధం పూర్తిగా అమలు కావడం లేదు.అవగాహన లేకపోవడం వినియోగదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై,అలాగే వ్యాపారులకు ప్రభుత్వ నిబంధనలపై ఇంకా పూర్తి అవగాహన లేదు.ప్లాస్టిక్ భూతం చాప కింద నీరుల పర్యావరణాన్ని కబలిస్తోంది. మన అవసరాలు తీరుస్తూ మన ఆరోగ్యాన్ని,భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేందుకు విస్తరిస్తోంది. విషవలయంలో ఇప్పటికే చాలావరకు మనకు మనం చిక్కుకున్నాం.ఇప్పటికైనా తేరుకోకపోతే మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. ప్రజల దైనందిక జీవనంలో భాగమైన ప్లాస్టిక్ పర్యావరణాన్ని నాశనం చేస్తూ ప్రజలను విష వలయంలోకి నడుతోంది.నింగి, నేల,గాలి,నీరులను కలుషితం చేస్తూ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. పోరుమామిళ్ల మండలంలోని కొన్ని దుకాణాలలో రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అంతకంతకు పెరిగిపోతుంది. ఆయా ప్రాంతాల్లో వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను మున్సిపాలిటీ కేంద్రాలకు సంబంధించిన చెరువులు,కుంటల్లో వేయడంతో నీటి కాలుష్యం పెరిగిపోతుంది.అదేవిధంగా డంపింగ్ యార్డులలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటించడంతో గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయి మానవ మనుగడకు ప్రశ్నార్ధకంగా మారిపోతుంది. ఇందుకు డంపింగ్ యార్డ్ లోని క్వింటాళ్లకొద్దీ కనబడుతున్న సంచులే పరిస్థితికి అడ్డం పడుతున్నాయి.పరిస్థితి ఇంత భయానకంగా మారుతున్న అధికార యంత్రాంగంలో ఎందుకు చలనం లేదో? అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి మార్పు తీసుకురావలసిన అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు.ఈ విషయంలో కలసపాడు పోరుమామిళ్ల బద్వేలు లు ఉన్న మున్సిపాలిటీలు అయితే చేసింది గుండుసున్న అనే చెప్పాలి.ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు దర్శనమిస్తుంటాయి.జ్యూస్ పాయింట్లు, హోటల్లు,వివిధ రకాల షాపుల్లో వీటి వినియోగం నిత్య కృత్యమై పోయింది.ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసిన పార్సిల్ చేయడం కోసం ప్లాస్టిక్ కవర్ అవసరంగా మారిపోయింది.ఇదిగో ప్రమాదం ఇలా పొంచి ఉంది విచ్చలవిడిగా కొనసాగుతున్న ప్లాస్టిక్ వినియోగంతో అటు పర్యావరణానికి ఇటు మూగజీవుల ప్రాణానికి ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కరిగిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ పడిన భూ ప్రాంతం పూర్తిగా ఎందుకు పనికిరాకుండా పోతుందని సూచనలు చేస్తున్నారు.పంట భూముల్లోకి తాగునీరు అందించే చెరువులు,కుంటల్లోకి చేరుకుంటూ జల కాలుష్యానికి కారణం అవుతోంది జలచరాలకు మరణ శాసనం రాస్తుంది. ఇన్ని దుష్ఫలితాలు చోటు చేసుకునే ప్లాస్టిక్ నివారణపై జిల్లాల యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు పర్యావరణ శాస్త్రవేత్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి,నిషేధిత వస్తువులు:ముఖ్యంగా 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు,స్పూన్లపై కఠిన నిబంధనలు ఉన్నాయి.అయితే,ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అమలు కావాలంటే అధికారుల చర్యలతో పాటు ప్రజలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని వార్తలు నొక్కి చెబుతున్నాయి.మిగతా భాగం రేపటి ప్రజావాణి న్యూస్ లో
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల, కలసపాడు, బద్వేల్, విచ్చల విడిగా సాగుతున్న ప్లాస్టిక్ వినియోగం ఉత్తమాటగా మారిన నిషేధం''
పోరుమామిళ్ల, కలసపాడు, బద్వేల్, విచ్చల విడిగా సాగుతున్న ప్లాస్టిక్ వినియోగం ఉత్తమాటగా మారిన నిషేధం”
0
8
RELATED ARTICLES
- Advertisment -

