ఘట్‌కేసర్, జూన్ 30: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పోచారం డివిజన్ పరిధిలోని యన్నంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 290వ పోలింగ్ కేంద్రంలో మంగళవారం ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడంతో పాటు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్ల తొలగింపునకు సంబంధించిన వివరాలను సేకరించారు. గణన పత్రాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించాలని ఓటర్లకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారి అరుణతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ స్థాయి ప్రతినిధి పోలగొని సహదేవ్ గౌడ్, ప్రభాకర్, లక్ష్మణ్, పోశెట్టి వెంకట్‌రెడ్డి, సుభాష్, మల్లారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు.




