పోచారం 290వ బూత్‌లో గణన పత్రాల పంపిణీ

ఘట్‌కేసర్, జూన్ 30: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పోచారం డివిజన్ పరిధిలోని యన్నంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 290వ పోలింగ్ కేంద్రంలో మంగళవారం ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడంతో పాటు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్ల తొలగింపునకు సంబంధించిన వివరాలను సేకరించారు. గణన పత్రాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించాలని ఓటర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బూత్...