పేరు లేని పాఠశాల..పరువు పోతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ..! ఐత్రంపేట జడ్పీహెచ్ఎస్‌లో నిర్లక్ష్యం పరాకాష్ట

వైఎస్ఆర్ కడప జిల్లా (ప్రజావాణి జూన్ 18) బి.కోడూరు మండలం పరిధిలోని ఐత్రంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS) లో నెలకొన్న అధ్వాన పరిస్థితులు,ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ,ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తుంటే.కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ వ్యవస్థకే తీరని కళంకం వస్తోంది.అక్కడి ప్రధానోపాధ్యాయుడు (హెడ్‌మాస్టర్) సుబ్బారావు నిర్లక్ష్య వైఖరిపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్థానిక పాఠశాల నిర్వహణ గాలికొదిలేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డుపై పేరే...