📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyఅనారోగ్యంతో ఉన్న గిరిజన కుటుంబంపై దాడి  కులం పేరుతో దౌర్జన్యాలు  అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల...

అనారోగ్యంతో ఉన్న గిరిజన కుటుంబంపై దాడి  కులం పేరుతో దౌర్జన్యాలు  అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

📰 Generate e-Paper Clip


పేద గిరిజన కుటుంబంపై దాడి.. కలం పేరుతో దౌర్జన్యాలు.. అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
నసురుల్లాబాద్, జూన్ 19 (ప్రజావాణి):
నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్ గ్రామం రాజేశ్వర్ తండాకు చెందిన ఓ పేద గిరిజన కుటుంబంపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడు మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన ఒల్లపు భాగయ్య గ్రామ మధ్యలో అందరూ చూస్తుండగానే తనను కలం పేరుతో దౌర్జన్యంగా భౌతిక దాడికి పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా, మోహన్ కుటుంబ సభ్యులైన భార్య, పిల్లలను సైతం అసభ్య పదజాలంతో దూషించి అవమానపరిచినట్లు తెలిపారు. తన వాహనంతో గుద్ది చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడమే కాకుండా, కుటుంబ సభ్యులందరి ప్రాణాలు హచ్చరికలో భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధిత కుటుంబం వాపోయింది.
“నన్ను పోలీసులు కూడా ఏమీ చేయలేరు” అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ ఘటనతో ఇప్పటికీ ఆత్రంకంగా వణికిపోతున్న గిరిజన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని గ్రామస్తులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఒల్లపు భాగయ్య గ్రామంలో పలువురిని బెదిరిస్తూ తరచూ వివాదాలు సృష్టిస్తున్నాడని, కొందరిపై దాడులకు కూడా పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతని ప్రవర్తన కారణంగా గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పేద గిరిజన కుటుంబంపై జరిగిన ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో భయాందోళనలకు కారణమవుతున్న వ్యక్తులపై పోలీసులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular