పెద్ది సుదర్శన్‌రెడ్డి కోలుకోవాలని బోడ మురళి నాయక్ ప్రత్యేక పూజలు
చెన్నారావుపేట జులై 26 ప్రజావాణి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్,యువ నాయకులు బోడ సాగర్ నాయక్,ఆదివారం కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చి ప్రజాసేవలో పాల్గొనాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూక్య లచ్చిరాం, గణేష్, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




