📄 ePaper
Sunday, June 7, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నాసిరకం పనులపై YSRCP నేతల క్షేత్రస్థాయి పరిశీలన.రూ.102 కోట్ల ప్రజాధనం దోపిడీపై...

పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నాసిరకం పనులపై YSRCP నేతల క్షేత్రస్థాయి పరిశీలన.రూ.102 కోట్ల ప్రజాధనం దోపిడీపై ఆగ్రహం

📰 Generate e-Paper Clip

పుంగనూరు జూన్ 7 ప్రజావాణి బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో అధికార కూటమి ప్రభుత్వం చేపట్టిన నాసిరకం పనులను, అవినీతిని YSRCP నేతలు క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. “నాసిరకం పనులకు రూ.102 కోట్ల నజరానా” శీర్షికన వచ్చిన కథనంపై స్పందించిన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు YSRCP నేతలు కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మాజీ ఎంపీ,కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ YSRCP సమన్వయకర్త మక్బూల్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం బందార్లపల్లి,తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద జరిగిన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నేతలు నిశితంగా పరిశీలించారు.కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సిమెంట్ లైనింగ్ చేయడం వల్ల అప్పుడే కెనాల్ గోడలు పెచ్చులూడిపోతున్నాయని, నాణ్యత లోపాన్ని నేతలు మీడియాకు ప్రత్యక్షంగా చూపించారు.ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, నాసిరకం పనులకు రూ.102 కోట్లు అప్పనంగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని YSRCP నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular