పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నాసిరకం పనులపై YSRCP నేతల క్షేత్రస్థాయి పరిశీలన.రూ.102 కోట్ల ప్రజాధనం దోపిడీపై ఆగ్రహం

పుంగనూరు జూన్ 7 ప్రజావాణి బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో అధికార కూటమి ప్రభుత్వం చేపట్టిన నాసిరకం పనులను, అవినీతిని YSRCP నేతలు క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. "నాసిరకం పనులకు రూ.102 కోట్ల నజరానా" శీర్షికన వచ్చిన కథనంపై స్పందించిన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు YSRCP నేతలు కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మాజీ ఎంపీ,కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ YSRCP సమన్వయకర్త మక్బూల్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం బందార్లపల్లి,తనకల్లు...