*పాపం పండింది… అక్రమాలకు రట్టయింది…?
*పందిళ్ళపల్లి మాజీ పంచాయతీ కార్యదర్శి పై వేటు..?
*కార్యదర్శి అక్రమాలు అవకతవకలపై విచారణ అధికారులుగా నియామకం….!
*వెలుగు చూసిన సివిల్ సర్వీసెస్ చట్టం నిబంధనల ఉల్లంఘనలు….?
*చేసిన ఉల్లంఘనలు చాలాదన్నట్లు ఇటీవల కొన్ని తప్పుడు వాంగ్మూలాలు సృష్టి…?
*రికార్డులు సురక్షితం… కానీ దాచి పెట్టారా అంటున్న జనాలు…?
*”మన ప్రజావాణి” ప్రత్యేక కథనాలకు బాధితులు ప్రజా సంఘాలు హర్షం
*ఖమ్మం జిల్లాలో మెరిసిన ప్రజావాణి… బాధితులకు దక్కిన న్యాయం
మన ప్రజావాణి ప్రత్యేక కథనం…
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
శివుడు ఆజ్ఞలు లేనిది చీమలైన కుట్టవు అంటారు.. ఎక్కడో మారుమూల పల్లె కాదు… కుగ్రామం అంతకంటే కాదు.. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా కేంద్రానికి పట్టుమని పది కిలోమీటర్ల దూరంలో ఆ పల్లె. సంపాదనకు రుచి మరిగి అక్రమాలకు ఒడి కడుతూ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా రికార్డులలో మార్పులు చేర్పులు సృష్టించి అక్రమాలు వెలుగు చూసిన తర్వాత వాటిని శిథిలం చేయటం లేదా కనిపించకుండా చేయడం అక్కడ పనిచేసిన ఓ మాజీ కార్యదర్శి కి వెన్నతో పెట్టిన విద్యగా వెలుగు చూసిన అక్రమాల బాగోతం. మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించిన నాటి పంచాయతీ కార్యదర్శి ప్రస్తుత మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు పందిళ్ళపల్లి గ్రామంలో సుమారు ఐదు సంవత్సరాలు విధులు నిర్వహించినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి సివిల్ సర్వీసెస్ చట్టం 1991 ప్రకారం ప్రభుత్వ నిబంధనలు నియమాలు ప్రకారం పని చేయాల్సి ఉండగా ఆ నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు గత ఏడాది నవంబర్ నెలలో ప్రజావాణి గ్రీవెన్స్ లో నాటి జిల్లా కలెక్టర్ డిపిఓ కు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సమగ్ర ఆధారాలతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన నాటి కలెక్టర్ డిపిఓ ఈ ఫిర్యాదును సుమోటోగా స్వీకరించి డిపిఓ ను విచారణ చేసేందుకు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు రెండు దశల్లో విచారణ చేసి సదరు మాజీ పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ నివేదిక ఆధారంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ సివిల్ సర్వీసెస్ చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రధానంగా 1991 సెక్షన్ (20) 20(2) ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆ మేరకు 1991 నియమావళి ప్రకారం 20(5) డిపిఓ ను విచారణ అధికారిగా నియమిస్తూ స్థానిక చింతకాని మండల పంచాయతీ అధికారిని ప్రజెంటింగ్ అధికారిగా నియమిస్తూ విచారణ చేసి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా పంచాయతీ కార్యదర్శి 1964 లోని రూల్ 24 ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి విధుల్లో కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు 1991 రూల్ 20 ప్రకారం విచారణ ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం అందింది. ఈ అంశాలపై పది రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానాన్ని అందించాలని ఆదేశిస్తూ ఆదేశాలు వెలుబడ్డాయి. పది రోజుల్లో అవకతవకలను అంగీకరించడం లేదా తిరస్కరించడం చేయాల్సి ఉంటుందని అలా జరగని పక్షంలో అందుబాటులో ఉన్న నిబంధనలు మేరకు సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పంచాయతీ రికార్డులు పదిలంగా ఉన్నట్లు ఎటువంటి ప్రమాదానికి గురికాలేదని ఉద్దేశపూర్వకంగా ఈ అక్రమాల వెనుక ఉన్న కొందరి అండదండలతో గుట్టుగా ఉంచినట్లు సమాచారం వాస్తవంగా పంచాయతీ కార్యాలయం దద్ధమైనప్పుడు రెండు మాత్రమే ఫైలు అదికూడా పహానిలు కాలిపోయినట్లు నాటి మాజీ పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం ఎర్రుపాలెం మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సదరు పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరు వలన ఓ కుటుంబం చిన్న బిన్నమైనట్లు లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అందరితో మంత్రాలు జరిపి ఎంపీ ఓ విచారణ సమయంలో తన హయాంలోనే రికార్డులు ధ్వంసం అయినట్లు తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించినట్లు సమాచారం 2004లో రెండు పహానిలుమాత్రమే కాలిపోయినట్లు నాటి పంచాయతీ కార్యదర్శి నేటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వ్యాఖ్యానించడం విశేషం.ఎటువంటి లింకు డాక్యుమెంట్లు ముటేషన్లు లేకుండా సమాచారం అందించకుండా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారులు ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవడం పట్ల బాధితులు ప్రజాసంఘాల కార్యకర్తలు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పందిళ్ళపల్లి పంచాయతీ రికార్డులు తారుమారు అక్రమాల గురించి మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వరుస కథనాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వ్యక్తం అవుతుంది.
*అక్రమాల దిట్ట… అనర్హులగుట్ట
అడ్డదారుల్లో రికార్డులు తారుమారు తో వచ్చిన హక్కులతో దర్జాగా రిజిస్ట్రేషన్ వ్యవహారం మరికొన్ని సమగ్ర వివరాలతో ఆధారాలతో.. రేపటి కథనంలో వేచి చూడండి…!







