ఆ బోరు పనిచేయటం లేదు..!
*పెంట దిబ్బలు ఇతర ఆటంకాలు తొలగిస్తాం..
*చర్యలు తీసుకుంటాం విద్యుత్ స్తంభాలు విద్యుత్ శాఖ పరిధిలో ఉంటాయి
అంటున్న నేలకొండపల్లి పంచాయతీ కార్యదర్శి సంపత్
*పనిచేయకపోతే… ఆక్రమణలు దుర్వాసనల మధ్య కాలనీవాసులు గడపలా
*వార్తా కథనం విషయం తెలవదట..
నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి జూలై 24
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నే లకొండపల్లి మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీలోని 14వ వార్డు ప్రధానంగా కాలువ కట్ట ప్రాంతంలో బీసీ కాలనీవాసులు గత సంవత్సరం నుండి మండల గ్రామస్థాయిలో ఫిర్యాదులు దరఖాస్తులు అందించారు. ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బీసీ కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఈ వ్యవహారంపై మండల బిజెపి అధ్యక్షుడు మరో పార్టీ నేత కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారికి పంచాయతీ కార్యదర్శికి సమస్యపై వివరించి వినతి పత్రం అందించినట్లు తెలిసింది. అయినప్పటికీ నేటి వరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం విశేషం. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఎన్ఎస్పి కాలువను ఆక్రమించి పెంట దిబ్బలు చెత్తాచెదారంతోపాటు కట్టెలు లాంటి వాటిని వేయడంతో కుక్కలు ఆ ప్రదేశాలలో నివాసం ఉంటూ రాకపోకలు సాగించే ప్రయాణికులపై దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఉదయం పూట ప్రధానంగా తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లే వారికి కూడా తీవ్ర ఆటంకంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కొందరు ఆక్రమించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు నోరు మెదపకపోవడం విశేషం. గ్రామీణ విద్యుదీకరణ పథకం కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చివరి ఇంటి వరకు కూడా ఆయా గ్రామాలలో కాలనీలలో విద్యుదీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు కోరినప్పటికీ విద్యుత్ స్తంభాలు మంజూరు చేయకపోవడం పట్ల కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మన ప్రజావాణి ప్రతినిధి స్థానిక నేలకొండపల్లి పంచాయతీ కార్యదర్శి సంపత్ ను వివరణ కోరగా స్పందిస్తూ బీసీ కాలనీ ప్రాంతంలో ప్రధానంగా కాలువ కట్ట ఏరియాలో బోరింగ్ పనిచేయటం లేదని పరిశీలించామని అన్నారు. కాలువ కట్టమీద ఇతర ప్రాంతాలలో పెంటదిబ్బలు పరిశీలించి కచ్చితంగా తొలగిస్తామని అన్నారు. గతం నుండి ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించగా కొత్తగా వచ్చానని తన దృష్టికి రాలేదని రాకపోయినప్పటికీ పరిశీలించాలి కదా అని ప్రశ్నించగా చూస్తున్నాను చేపిస్తాను తొలగిస్తాము అంటూ సమాధానాలు ఇచ్చారు. కాలనీలో చివరి గృహ సముదాయాలకు విద్యుత్ స్తంభాల కొరత ఉందని ప్రశ్నించగా మండల విద్యుత్ శాఖ అధికారి పరిధిలో ఉంటుందని వారిని సంప్రదించమని సోషల్ మీడియాలో పత్రికలో ప్రచురితమైన వార్తా కథనం గురించి తెలవదని బదులిచ్చారు.
*కాలువ కట్ల సంరక్షణ.. ఎన్ఎస్పీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరికొన్ని వివరాలతో రేపటి కథనం… 3లో వేచి చూడండి..!




