📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetపలు అభివృద్ధి పనులకీ శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

పలు అభివృద్ధి పనులకీ శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 11(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపనలు చేశారు. బెజ్జంకి మండలంలోని కస్తూరిబా పాఠశాలలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు భూమి పూజ నిర్వహించారు.అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.6 లక్షలతో పాఠశాల వంటగది నిర్మాణ పనులు, రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యంగా విద్యా, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ,ప్రజలకు అవసరమైన సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత, బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular