పలు అభివృద్ధి పనులకీ శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి, మే 11(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపనలు చేశారు. బెజ్జంకి మండలంలోని కస్తూరిబా పాఠశాలలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు భూమి పూజ నిర్వహించారు.అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.6 లక్షలతో పాఠశాల వంటగది నిర్మాణ పనులు, రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని,...