📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetపర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి  పౌరుడిపై ఉంది

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి  పౌరుడిపై ఉంది

📰 Generate e-Paper Clip

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి  పౌరుడిపై ఉంది..

సబ్ జడ్జి కే సురేష్..
కోదాడ, జూన్ 05/ ప్రజావాణి
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ కోర్టు ఆవరణలో శుక్రవారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో  మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కోదాడ సబ్ జడ్జి కే. సురేష్  న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి కోర్టు ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి నీళ్లు పోశారు.ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ మాట్లాడుతూ  ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు మనం స్వచ్ఛమైన గాలిని, కలుషితం కాని నీటిని అందించాలంటే నేటి నుంచే పెద్దఎత్తున వృక్షాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి పెరిగే వరకు బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, ఫస్ట్ ఏడీఎం జడ్జి మహమ్మద్ ఉమర్ , సెకండ్ ఏడీఎం జడ్జి జాకియా సుల్తానాలతో పాటు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కెవి రావు, హేమలత, పెద్దబ్బాయి, తాటి మురళి, ఉయ్యాల నరసయ్య, శరత్ కుమార్, నవీన్ కుమార్, రవీందర్, పారా లీగల్ వాలంటీర్ లు,కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular