**
* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 28
పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నూతన బోర్ వేల్ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఈ బోర్ వేల్ తో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య తీరనుందని హర్షం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోర్ వేల్ మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, నాయకులు గుడ్ల రమేష్, నేరువట్ల శ్రీనివాస్, గడ్డం రజిని, ఎండీ పాషా, ఎండీ ఇషాక్, విజయ్, రామకృష్ణ, బోగి వెంకటేశ్వర్లు, అన్నం మదనయ్య, శనిగారపు చంద్రయ్య, రాయబారపు కిరణ్, సాత్విక్, రుత్విక్ లు పాల్గొన్నారు.
నూతన బోర్ వేల్ పనులు ప్రారంభం
RELATED ARTICLES




