📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaనూతనంగా ఎన్నికైన కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఘన సన్మానం

నూతనంగా ఎన్నికైన కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నూతనంగా ఎన్నికైన కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్‌కు ఘన సన్మానం

 

కమలాపూర్ ప్రజావాణి ఆగస్టు 4

 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో, నూతనంగా కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వాసాల శ్రీనివాస్ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

 

ఈ సందర్భంగా వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మటం కుమారస్వామి, యుగేందర్, సురేందర్, రాయమల్లు తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular