.పసర-4, అభ్యుదయ కాలనీలో తల్లిపాల వారోత్సవాలు.
.తల్లిపాలు అమృతం లాంటివి – అవగాహన.
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి);-
గోవిందరావుపేట మండలం పసర
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పసర-4 మరియు అభ్యుదయ కాలనీ అంగన్వాడి కేంద్రాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తల్లిపాల వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేశారు. డబ్బా పాలు వద్దు – అమ్మ పాలు ముద్దు అనే నినాదంతో తల్లిపాలు అమృతం లాంటివని వివరించారు.జయ నర్సింగ్ హోమ్ లో డెలివరీ అయిన తల్లులను, గృహ సందర్శనల ద్వారా బాలింతలను కలిసి అవగాహన కల్పించారు.
పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల మొదట వచ్చే చిక్కని పసుపు రంగు పాలు కొలెస్ట్రమ్ వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది
తల్లికి బిడ్డకు అనుబంధం పెరుగుతుంది.తల్లి గర్భసంచి యధాస్థానానికి త్వరగా వస్తుంది.బాలింతలు తినాల్సిన ఆహారం గురించి కూడా సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డా. కుమారస్వామి పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
అంగన్వాడి టీచర్లు K. పద్మారాణి, P. సరిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తల్లులకు అవగాహన కల్పించారు.




