అన్నమయ్య జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) మదనపల్లి,జలధార–జలహారతి 100 రోజుల పనులు పక్కా ప్రణాళికతో నాణ్యతగా పూర్తి చేయాలి మదనపల్లి,చేపట్టిన జలధార–జలహారతి 100 రోజుల కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేసి అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జల వనరుల శాఖ,డ్వామా,భూగర్భ జలాలు,సబ్ కలెక్టర్,ఆర్డీవోలు,మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు,ఏపీడీలు,ఇంజనీరింగ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గతవారం,ప్రస్తుత వారంలో సాధించిన ప్రగతిని పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని మండలాల వారీగా జలధార–జలహారతి కార్యక్రమాల అమలు ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారులు వివరించగా,కలెక్టర్ పనులలో లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ప్రతి పనిని ఖచ్చితమైన కొలతలతో వందశాతం నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఉన్న చెరువులు,వాగులు, వంకలను గుర్తించి వాటి నీటి ప్రవాహ మార్గాలను ఆర్డర్-1, 2, 3 ప్రకారం అనుసంధానం చేయాలని,ఒక చెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీరు చేరే విధంగా వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించారు.గ్రామస్థాయిలో వాటర్ రిసోర్స్ అధికారులు,ఎంపీడీవోలు,ఇంజనీరింగ్ మరియు ఫీల్డ్ సిబ్బంది స్థానిక వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు,పెద్దలతో సమావేశాలు నిర్వహించి చెరువుల స్థితిగతులను తెలుసుకోవాలని తెలిపారు.గత సంవత్సరంలో చెరువుల నింపుదల స్థితి,పూర్తిగా నిండినవి, సగం నిండినవి,నీరు చేరని చెరువులపై పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా నీరు చేరని చెరువులను ప్రాధాన్యతగా తీసుకుని కారణాలను గుర్తించాలని,వాగులు,కాలువలు పూడికతో నిండిపోవడం,ఆక్రమణలు,చెట్ల పెరుగుదల వంటి అంశాలను పరిశీలించి సమస్యలను గుర్తించాలన్నారు.ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా సమస్యలను ఖచ్చితంగా గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.నరేగా కార్మికులను వినియోగించి పూడికతీత పనులు,కాలువల శుభ్రత, చెట్ల తొలగింపు చేపట్టాలని,ఆక్రమణలపై రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని వెంటనే తొలగించాలని ఆదేశించారు.కొండల నుంచి వచ్చే నీరు చెరువులకు చేరేలా సహజ ప్రవాహ మార్గాలను పునరుద్ధరించాలని తెలిపారు.ఒక చెరువు నుంచి మరొక చెరువుకు నీరు చేరే సరఫరా కాలువల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలని,స్లూసులు,సర్ప్లస్ వీర్లు లీకేజీలను గుర్తించి సరిచేయాలని సూచించారు.బోర్వెల్ ఆధారిత వరి సాగును తగ్గించి సూక్ష్మ సేద్యం ద్వారా ఉద్యాన మరియు పూల సాగును ప్రోత్సహించాలని రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ,సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్,జిఎస్డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి,ఆర్డీవో శ్రీనివాస్,మండల ప్రత్యేక అధికారులు,ఎంపీడీవోలు,డ్వామా ఏపీడీలు,ఇంజనీరింగ్,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.డిఐపిఆర్వో,
Homeఆంధ్రప్రదేశ్నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో ప్రతి చెరువుకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి,,జిల్లా కలెక్టర్ నిశాంత్...
నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో ప్రతి చెరువుకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి,,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
0
8
- Advertisment -




