నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో ప్రతి చెరువుకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి,,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) మదనపల్లి,జలధార–జలహారతి 100 రోజుల పనులు పక్కా ప్రణాళికతో నాణ్యతగా పూర్తి చేయాలి మదనపల్లి,చేపట్టిన జలధార–జలహారతి 100 రోజుల కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేసి అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జల వనరుల శాఖ,డ్వామా,భూగర్భ జలాలు,సబ్ కలెక్టర్,ఆర్డీవోలు,మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు,ఏపీడీలు,ఇంజనీరింగ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గతవారం,ప్రస్తుత వారంలో సాధించిన ప్రగతిని పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై...