📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నా వ్యక్తిత్వం ఏమిటి అనేది నా పై అధికారులకు,నా తోటి సిబ్బందికి అందరికి తెలుసు,,డి ఈ...

నా వ్యక్తిత్వం ఏమిటి అనేది నా పై అధికారులకు,నా తోటి సిబ్బందికి అందరికి తెలుసు,,డి ఈ ఈ మైదుకూరు సబ్ డివిజన్

📰 Generate e-Paper Clip

                           ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) మైదుకూరు                                           వ్యక్తిగత ప్రయోజన కారణంతో గడచిన 4సంవత్సరాలుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కామనూరు శ్రీనివాసులురెడ్డి.నా విధి నిర్వహణలో అధికారిక పనులలో తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను అసభ్యపదజాలంతో మాట్లాడను అనే విషయం నా దగ్గర పనిచేసిన,పనిచేస్తున్న సిబ్బందికి అందరికి తెలుసు,మీకు సంబంధం లేని విషయాల మీద మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు.నేను ఎవరినైనా అసభ్యకరంగా మాట్లాడి ఉంటే వారితో కలిసి సాక్ష్యాలతో మీరు నిరూపించుకోవచ్చు.దీని కొరకు నా అనుమతి అవసరం లేదు. నేను తప్పు చేస్తే నా పై అధికారులు నా మీద చర్యలు తీసుకుంటారు.నన్ను వివరణ అడుగుతారు,నేను వివరణ ఇస్తాను.నీలాంటి వ్యక్తులకు భయపడి,నీ ఆరోపణలకు స్పందించవలసిన అవసరం ఇక మీదట నాకు లేదు.నేను ఎలాంటి వాడిని,నా వ్యక్తిత్వం ఏమిటి అనేది నా పై అధికారులకు,నా తోటి సిబ్బందికి అందరికి తెలుసు. పై అధికారుల వద్దకు వెళ్ళటానికి తేదీ చెప్పండి అని నన్ను అడుగుతున్నారు,నేను నిజాయితీగా పనిచేస్తున్నాను,ప్రజల కోసం పనిచేస్తున్నాను. నేను నా విధి నిర్వహణలో వివాదాలకు,తగాదాలకు దూరంగా ఉండే వ్యక్తిని. చాపాడు జే.ఈ.అయిన శ్రీ సాయి ప్రసాద్ గత ఆరు సంవత్సరాలుగా నాకు టచ్ లో లేడు,ఇతను ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రైతుల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు కాజేసిన విషయాన్ని ప్రజలకు,నాయకులకు & అధికారులకు తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తిని నేను.నేను మైదుకూరులో విధుల్లో చేరక మునుపే కొన్ని ఆరోపణలతో ఇతన్ని విధుల నుండి సస్పెండ్ చేశారు.ఇతని మీద ప్రజలతో నేరుగా విచారణ చేసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందే నేను,ఇందులో తమ పాత్ర ఉన్న అధికారులు ఎక్కడ ఇరుక్కుంటామో అనే ఆలోచనతో దానిని నొక్కి పెట్టాలని చూస్తున్నారు,ఇందులో మీ యూనియన్ కు సంబంధించిన కొందరు సిబ్బంది ప్రమేయం కూడా ఉంది అనేది వాస్తవం.జమ్మలమడుగు రెవెన్యూ ఆఫీసులో జరిగిన కుంభకోణం అనేది నాకు ఏ రకంగా సంబంధం ఉంటుంది,ఒక వ్యవస్థలో అనేక అవినీతి కార్యకలాపాలు జరుగుతుంటాయి,అందులో నా పాత్ర ఏమిటనేది మొదటగా మీరు తెలుసుకోవాలి,సాక్ష్యాలు ఉంటే నేరుగా నిరూపణ చేయాలి.ఇక మీరు కాంట్రాక్టు కార్మికుల నియామకం గురించి మాట్లాడారు,ఇందులో గుత్తేదారుడు మరియు ఉన్నతాధికారుల నిర్ణయం మాత్రమే ఫైనల్ గా ఉంటుంది,అందులో నా పాత్ర ఏ మాత్రం ఉండదు అనేది మొదటగా మీరు తెలుసుకోవాలి.గతంలో,ఎప్పుడో 20సంవత్సరాల క్రితం నుండి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న వాటికి నేను ఎలా బాధ్యుడను అవుతాను,జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఈ నకిలీ అనేది జరిగింది,ఇందులో నా ప్రమేయం గురించి ఆరోపణ చేసే ముందు నా పాత్ర గురించి నిర్ధారణ చేసుకోవాలి. పులివెందుల,మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని మండలాలలో ఉన్న ఏ గ్రామంలోనైనా ప్రజలతో నా నిజాయితీ,నా పనితనం గురించి నేరుగా విచారణకు నేను సిద్ధంగా ఉంటాను. ఇలాంటి బ్లాక్ మెయిల్ మెసేజ్ లకు,వ్యక్తులకు ఎప్పుడూ కూడా నేను భయపడను.మీరు నా మీద చేసిన ఆరోపణ ప్రతిదీ కూడా నిరాధారమైనవి,ఒక వ్యవస్థలో కింది అధికారులు తప్పు చేస్తే పై అధికారులు చర్యలు తీసుకునే అధికారం తప్పకుండా ఉంటుంది,వ్యవస్థను నియంత్రించడానికి నేను ఉన్నది నా స్వంత సంస్థ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి.నేను ఏ డివిజన్ లో పనిచేసినా కూడా నిజాయితీ,నిబద్ధతతో పనిచేస్తాను  సిబ్బందితో కూడా నిబద్ధతగా పనిచేపించడం నాకు ఉన్న బాధ్యత,ఇది అలవాటు. ఇది గిట్టని వారు  తమ.స్వలాభం కొరకు మీ లాంటి వారిని ఉసిగొల్పి,ఈ విధమైన ఆరోపణలు చేయించటం అనేది సహజంగా జరుగుతుంది. గత నాలుగు సంవత్సరాల నుండి నా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నావు , ఆధారాలు ఉంటే నిరభ్యంతరంగా నిరూపించుకోవచ్చు. కొందరు చేస్తున్న మితిమీరిన అవినీతికి నేను అడ్డుగా ఉన్న అనే ఉద్దేశంతో మీ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు.నా సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న లంచగొండితనం,అవినీతి భాగోతం ఒక్కొక్కటి బయటకు తీసి సంబంధిత వారిపై చర్యలకు సిఫారసు చేస్తాను.ప్రజలను, రైతులను లంచం కొరకు పీడిస్తున్న వారి మీద ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకుంటాము.వాస్తవాలు తెలుసుకోండి,మంచి మార్గంలో అడుగులు వేయండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular