📄 ePaper
Friday, July 10, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliనరసింహ నగర్‌లో విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం

నరసింహ నగర్‌లో విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం

📰 Generate e-Paper Clip

నరసింహ నగర్‌లో విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం


రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని నరసింహ నగర్‌లో గురువారం 11 కేవీ విద్యుత్ లైన్ తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ స్వయంగా పనులను పర్యవేక్షించడంతో విద్యుత్ సిబ్బంది వేగంగా మరమ్మతులు పూర్తి చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.దీంతో నరసింహ నగర్ తో పాటు గ్రామ ప్రజలు ఉపశమనం పొందారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమస్యను సత్వరమే పరిష్కరించిన సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి, గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్ తీరును స్థానికులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని గ్రామస్థులు పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వల్లే పెద్ద ఇబ్బందులు తలెత్తకుండా నివారించగలిగామని స్థానికులు అభిప్రాయపడ్డారు. తక్షణమే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా అందించిన విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular