📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetతెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను ఆకస్మిక :...

తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను ఆకస్మిక : జిల్లా కలెక్టర్ కె.హైమావతి

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి

చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగు లను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు తినేటప్పుడు అరవడం, తిన్న మెతుకులు కింద పడడం చూసి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కూడిన అలవాట్లను నేర్పించాలని పిఈటి లను హెచ్చరించారు. అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా శుభ్రంగా ఒక్క మెతుకు కూడా కింద పడనియ్యకుండా తినాలని విద్యార్థులకు సూచించారు. మళ్ళీ విసిట్ కు వస్తానని విద్యార్థులకు ప్రవర్తనలో మార్పు రాకుంటే సహించేది లేదని సిబ్బందిని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular