📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తప్పు మీది.. తిప్పలు మాకా? పెనుగంచిప్రోలులో అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్న సామాన్యులు

తప్పు మీది.. తిప్పలు మాకా? పెనుగంచిప్రోలులో అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్న సామాన్యులు

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి (న్యూస్ మే11)పెనుగంచిప్రోలులో ‘కుల’ కల్లోలం వీఆర్వోల కలం పోటుకు కులాలు మారుతున్నాయి.బ్రతికుండగానే చరిత్రను మార్చేస్తున్న వైనం పెనుగంచిప్రోలు మండలంలో రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తోంది ప్రజలకు సేవ చేయాలా లేక వారి అస్తిత్వంతో ఆటలాడాలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ప్రవేశపెట్టిన ‘పర్మినెంట్ క్యాస్ట్’శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం విధానాన్ని కొందరు వీఆర్వోలు తమ నిర్లక్ష్యంతో నవ్వుల పాలు చేస్తున్నారు.ఇది పొరపాటు కాదు.సామాన్యుల సామాజిక మూలాలను తెంచేసే’పెను కుట్ర’కులాల ‘మార్పిడి’ కేంద్రాలుగా విఆర్వో ఆఫీసులు తరతరాలుగా ఒకే కులంలో పుట్టి పెరిగిన వారిని,రాత్రికి రాత్రే కంప్యూటర్ స్క్రీన్ మీద కులాలు మార్చేస్తున్నారు.ఎస్సీలను బీసీలుగా,బీసీలను ఓసీలుగా,ఓసీలను ఎస్సీలుగా మార్చేస్తూ.ఒక మాయాజాలాన్ని సృష్టిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా,కళ్లు మూసుకుని ధృవీకరణలు ఇస్తున్న ఈ ‘కలం వీరులు’ అసలు అధికారులేనా లేక వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి వచ్చిన అవతారాలా?తప్పు మీది.శిక్ష ప్రజలకా ఎంత బరితెగింపు తప్పుగా ధృవీకరించిన సర్టిఫికేట్లను చూసి బాధితులు ప్రశ్నిస్తే.సారీ,తప్పు జరిగింది.మళ్ళీ అప్లై చేసుకోండి అంటూ అడ్డగోలు సమాధానాలు ఇస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుడు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలా మీ చేతకానితనానికి ప్రజలు బలి కావాలా అసలు ఈ తప్పుల వెనుక ఏవైనా’అక్రమ వసూళ్లు’ఉన్నాయా లేక కావాలనే చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు పెనుగంచిప్రోలులో సెగలు పుట్టిస్తున్నాయి.ప్రభుత్వానికి ‘వెన్నుపోటు’.ఉన్నతాధికారుల మౌనం దేనికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక పథకానికి పెనుగంచిప్రోలు మండల వీఆర్వోలు తూట్లు పొడుస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మర్మమేంటి? తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులైన వీఆర్వోలను సస్పెండ్ చేయడమే కాకుండా,వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ కులాల గందరగోళం గనుక త్వరగా సర్దుబాటు కాకపోతే.పెనుగంచిప్రోలు రెవెన్యూ కార్యాలయం ముందు బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం అని చర్చించుకుంటున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular