డ్వాక్రా సంఘాలకు డిజిటల్ సేవలు… సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) సత్యవేడు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల సాధికారతకు ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది.మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత డిజిటల్ దిశగా తీసుకెళ్లేందుకు సంఘమిత్రలకు ఉచిత మొబైల్ ఫోన్లను అందజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మహిళా సంఘాల అభివృద్ధిలో సంఘమిత్రలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల పొదుపులు,రుణాల వసూళ్లు, బ్యాంకు లావాదేవీలు వంటి అంశాల్లో సంఘమిత్రలు...