📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్డెంగ్యూను అంతం చేయండి. గోపవరం వైద్యాధికారి మహేశ్వర్ రెడ్డి.

డెంగ్యూను అంతం చేయండి. గోపవరం వైద్యాధికారి మహేశ్వర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

గోపవరం ప్రజావాణి న్యూస్

దోమలను నివారించి డెంగ్యూను అంతం చేయాలని, గోపవరం వైద్య అధికారి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గోపవరంలో శనివారం జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, గోపవరం పీహెచ్సీ వైద్య సిబ్బంది బ్యానర్లు చేతపట్టి ,దోమ పుట్టకూడదు, కుట్టకూడదు ,పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలని, లార్వాదశలోనే దోమలను అంతం చేయాలని అంటూ, నినాదాలు చేస్తూ, పలు వీధులలో ర్యాలీ, వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్టు అను దోమ వలన ఈ వ్యాధి వస్తుందన్నారు .ఈ వ్యాధి ప్రాణాంతకరం కావచ్చు అన్నారు .దోమ కాటుకు దూరంగా ఉంటేనే డెంగ్యూ జ్వరం రాదన్నారు. సబ్ యూనిట్ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించి, ప్రతి ఇంటికి సర్వే నిర్వహించి లార్వా ఉన్న నీటిని పడవేస్తున్నామన్నారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ,వారికి శుభ్రత పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే వైద్యం 104 ,విలేజ్ హెల్త్ క్లినిక్, అవసరమైన చోట్ల మెడికల్ క్యాంపులను నిర్వహించి, మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రమాదం జరిగిన చోటికి తక్షణమే 108 సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు పోయి వేల రూపాయలు పోగొట్టుకోవద్దన్నారు .ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ, ఎన్ ఎం డి గౌస్ ,హెల్త్ అసిస్టెంట్లు సుబ్బారెడ్డి, జనార్దన్ రావు, మహమ్మద్ ఖాసిం ,సుబ్బారెడ్డి, వైద్య సిబ్బంది ,అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular