📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతికి ఘనంగా నివాళులు అర్పించిన అన్నోజిగూడ వికలాంగుల కాలనీవాసులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతికి ఘనంగా నివాళులు అర్పించిన అన్నోజిగూడ వికలాంగుల కాలనీవాసులు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం వార్డ్ అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ దివ్యాంగుల కాలనీలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకుడు, అర్బన్ లోకల్ బాడీ ఫిజికల్లీ చాలెంజర్ పర్సన్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, మహాజన చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి నాయకుడు మొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పూలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మొక్క మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులవ్యవస్థతో అవమానాలు ఎదుర్కొంటూ అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అందించేలా అది పెద్ద రాజ్యాంగ రచన చేసినాడు. ఆయన పుట్టి ఇప్పుడు 135 సంవత్సరాలు అవుతున్న ఇంకా వికలాంగుల భవిష్యత్తు మారలేదు పెంచల పైన బతికేలా చేస్తున్న ఈ ప్రభుత్వాలు కనీసం పించనేనా వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పెంచుతున్నారా అంటే అది లేదు. అందుకే గత నెల రోజుల నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి ఇంద్ర పార్క్ లో నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు. మరి వికలాంగులు ఎవరికి చెప్పుకోవాలి. అధికారం లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరొక మాట చెబుతూ కాలం చేస్తున్న ప్రభుత్వాలు ఇవి నిరంకుశ ప్రభుత్వాలుగా మారిపోయాయి అధికారంలోకి వచ్చేది వాళ్ళ పబ్బం కడుక్కోవడానికి అన్నట్టు కమిషన్ రాజకీయాలతో కాల కాన గడుపుతున్నారు. మరో రెండు సంవత్సరాలు అయితే మళ్లీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు చూద్దాం లేనట్లు అన్ని సామాజిక వర్గాలను మోసం చేసింది ఈ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా మోసపోయింది వికలాంగులు సామెత కోరికమే ప్రభుత్వం రాగానే ఒక మరుగుజ్జు వికలాంగులానికి అవుట్సోర్సింగ్ జాబ్ ఇచ్చి నేను పెద్ద ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అంటూ చాటుకున్నాడు. తర్వాత తెలిసింది ఆ ముఖ్యమంత్రి నిజ స్వరూపం అది ప్రభుత్వ జాబ్ కాదు అవుట్ కోచింగ్ జాబ్ అని మేక వన్నె పులిలాగా అధికారంలోకి వచ్చారని, ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా హక్కులు గుర్తు చేసుకుంటూ వికలాంగులు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సమితి ఆధ్వర్యంలో నిర్వహించగల పెట్టినటువంటి మలక్ పేట నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీతో చేరుకొని అంబేద్కర్ కి నివేదనా పత్రాన్ని ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్త పిలుపుతో అన్నోజిగూడ కాలనీ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల కాలనీ నాయకులు భాగం శ్రీనివాస్ చౌదరి, ఎస్కే అన్వర్ పాషా, సిపిఐ మండల నాయకులు లొట్టి ఈశ్వర్, బాల్నే రాజు గౌడ్, బుధారపు రామకృష్ణ, సురేష్ నాయుడు, ఎలగొండ బిక్షపతి, సంతోష, బోడపట్ల దివ్య, మర్రి రమణమ్మ, బాల నర్సయ్య, అంజయ్య, సుధాకర్, మౌలానా తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.

Previous article
స్వాతంత్ర భారత దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరువ లేనివి మామిళ్ళగూడెం గ్రామంలో డా|| బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మోతే ఏప్రిల్ 14 (ప్రజావాణి) మామిళ్ళగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సంఘ సంస్కర్త,ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి గారు మాట్లాడుతూ భారత దేశానికి వారు చేసిన సేవలు మరువ లేనివి అన్నారు. ఇట్టి కార్యక్రమం లో శ్రీ వేంకటేశ్వర విద్య సంస్థల అధినేత md జనిమియా గారు అంబేద్కర్ గారు ఏ ఒక్క కుళానికో మతానికో చెందిన వారుకాదు అందరి వాడు అని కొనియాడి నాడు….ఇట్టి కార్యక్రమం లో నర్సయ్య,రామకోటయ్య,వెంకన్న,అంబేద్కర్, జానిపాషా మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular