📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialటాప్ ఫలితాలతో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు588 మార్కులతో అగ్రస్థానంలో టి.హర్షిత్ మందమర్రి

టాప్ ఫలితాలతో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు588 మార్కులతో అగ్రస్థానంలో టి.హర్షిత్ మందమర్రి

📰 Generate e-Paper Clip

టాప్ ఫలితాలతో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
588 మార్కులతో అగ్రస్థానంలో టి.హర్షిత్
మందమర్రి, (మన ప్రజావాణి)

మందమర్రి ప్రాంతంలోని శ్రీ చైతన్య స్కూల్ ఈ విద్యాసంవత్సరంలో అద్భుత ఫలితాలతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధిస్తూ పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు.ఈ ఫలితాల్లో టి. హర్షిత్ 588 మార్కులు సాధించి పాఠశాలలో అగ్రస్థానంలో నిలిచారు. ఎస్. సాధ్విన్ 579 మార్కులతో ద్వితీయ స్థానం, కె. ఇథిశ్రీ 577 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు. అదేవిధంగా ఏ. సత్యసత్విక 572 మార్కులు, జి. సహస్ర 571 మార్కులు సాధించి వరుసగా నాల్గవ, ఐదవ స్థానాల్లో నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ “విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ ఫలితాలకు కారణమయ్యాయి. ప్రతీ విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకుని క్రమశిక్షణతో చదివితే ఇంకా ఉన్నత విజయాలు సాధించవచ్చు. భవిష్యత్తులో కూడా మా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం” అని తెలిపారు.విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, పాఠశాల యాజమాన్యం అందించిన సౌకర్యాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్థానికులు విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular